Wiki said about Palakollu

పాలకొల్లు (palakol, palakollu), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము, చిన్న పట్టణము. పాలకొల్లు చుట్టుప్రక్కల భూములు సారవంతమైనవి. ఊరిచుట్టూ పచ్చని వరిచేలుకొబ్బరితోటలుచేపల చెరువులు కనిపిస్తాయి. పాలకొల్లు నుండి నరసాపురం పట్టణానికి 10 కి.మీ. దూరం. పాలకొల్లుకు 7 కి.మీ. దూరంలో చించినాడ వద్ద వశిష్టగోదావరి నదిపై కట్టిన వంతెన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలను కలుపుతుంది.


పంచారామక్షేత్రం:
ఆంధ్రప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు ఒకటి. శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో ప్రతిష్టితమైన ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది. క్షీరం అంటే పాలు. ఆ పేరుమీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడ బాణం వేస్తే భూమి లోనుంచి పాలు ఉబికివచ్చాయి. పాలకొల్లును పూర్వము క్షీరపురి, పాలకొలను అని పిలిచేవారు. ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో, 10 - 11 శతాబ్దులలో, నిర్మించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉన్నది గోపుర నిర్మాణసమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టినిపోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట ఆవిధంగా మట్టి తీయగా ఏర్పడినదే ఈ చెరువు(ప్రస్తుతం దీనిని రామగుండం అని పిలుస్తున్నారు). తదనంతరం ప్రతిరోజూ చేయబడే అభిషేకక్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అను పేరున పిలువబడుతూ ఆప్రాంతమునకు కూడా వర్తించి ఉండ వచ్చని ఒక కథనం. ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన,మరియు చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి.



ఇతర దేవాలయములు:
  • కాలువ మార్గములో షిర్డిసాయినాథుని మందిరము నాలుగెకరాల విస్తీర్ణములో కలదు. ఆలయము వెనుక భోజనశాల, ధ్యాన మందిరము, ఉద్యాన వనములు కలవు. గురువారము రోజున వేలమంది స్వామిని దర్శించేందుకు తరలి వస్తుంటారు. ప్రతి రోజూ ఉచిత భోజన కార్యక్రము జరుగును.
  • అయ్యప్పస్వామి వారి ఆలయము. సాయినాథుని దేవాలయమునకు ఎదురుగా కాలవ ఇవతలి వైపు నర్సాపురం వెళ్ళే రోడ్డులో రెండు అంతస్తులుగా అద్భుత నిర్మాణముగా మలచినారు.
  • పాలకొల్లు చిన్న గోపురం అని పిలువబడే మరొక ఆలయము కలదు.ఇక్కడి మూలవిరాట్ కేశవస్వామివారు
  • అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి మందిరం ఉంది. ఇక్కడి బ్రహ్మోత్సవం ఊళ్ళో ఒక పెద్ద పండుగ. ఈ మందిరంలో ధనుర్మాసంలో జరిపే ప్రత్యేక పూజలు కూడా ప్రసిద్ధం.
  • ఎడ్ల బజారు వద్ద గల శ్రీ కనకదుర్గమ్మవారి దేవస్థానము కలదు. దసరా ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుపుతారు. నాటకాలు బుర్రకథలు,హరికథలు మొదలగునవి పదిరోజులు పాటు ప్రదర్శిస్తారు.
  • పాలకొల్లు పట్టణ దేవత శ్రీ పెద్దింట్లమ్మ వారు. పాలకొల్లు వర్తకసంఘాల ఆధ్వర్యంలో పదిరోజులు జరిగే పెద్దింట్లమ్మ వారి ఉత్సవాలలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రఖ్యాత నాటక సమాజాల వారిచే నాటకాలు ప్రదర్శించబడును.
  • పాలకొల్లు గ్రామ దేవత దెసాలమ్మ వారు.           మరికొన్ని విశేషాలులలితకళాంజలి కళాక్షేత్రం.విద్యుదాధారిత వినోద సాధనాలు పెరుగుతుండటంతో నాటకాలకు తరిగి పోతున్న ఆదరణ ఎరిగినదే. అటువంటి కళా సంరక్షణార్ధం ఏర్పాటైన కొద్ది సంస్థలలో లలిత కళాంజలి కళా క్షేత్రం ఒకటి. ప్రతి సంవత్సరం నాటకోత్సవాలు నిర్వహించి ఉత్తమ నాటకాలకు, ఉత్తమ నటీ నటులకు పురస్కారములతో సత్కరించటం జరుగుతున్నది. ఈ సంస్థ ద్వారా ఇప్పటికే ప్రసిద్దులైన ఎందరో నటీ నటులు సినిమాలకు పరిచయమయ్యారు, అవుతున్నారు.

    లయన్స్ క్లబ్ మరియు సంగీతకాడమీ.పాలకొల్లు లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో ప్రజోపకార కార్యక్రమములు జరుగుతున్నవి. ఉచిత నేత్ర శస్త్ర చికిత్సా శిబిరాలు, వికలాంగులగు ఆర్థిక సహాయములు, ఆధారములేని స్త్రీలకు కుట్టు మిషన్లు పంపిణీ ఇలా పలు కార్యక్రమములు ఎప్పుడూ నిర్వహిస్తూనే ఉంటారు. సంగీతాసక్తి ఉన్న వారికి మంచి ఉపాద్యాయులద్వారా శిక్షణ తరగతులు, పేద విద్యార్ధులకు ఉచిత కంప్యూటరు శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారు.

    బాలకేంద్రం (మహిళామండలి)బాలలకు కళా రూపాలైన భరతనాట్యంచిత్రలేఖనంసంగీతం లాంటివాటిలో శిక్షణ ఇస్తుంటారు. 1980 అక్టోబర్ రెండున ప్రారంబించిన ఈ బాలకేంద్రం దివంగత బొండాడ వెంకట్రామగుప్త కృసి పలితంగా పాలకొల్లుకు కేటాయించారు. మహిళా మడలి భవనంలో కొంతభాగమును దీనికి కేతాయించారు. ఇక్కడ నామమాత్రపు రుసుము 50 రూపాయలతో వివిద విభాగాలలో శిక్షణ ఇస్తున్నారు. కేవలం కళలోనే కాక వృత్తి విద్యా కోర్సులైన టైలరింగ్, అద్దకం వంటి వాట్ని కూడ నేర్పుతున్నారు.

    ఇక్కడ శిక్షణ ఇచ్చు కోర్సులు. వీణగాత్రంవేణువుభరతనాట్యంకూచిపూడిచిత్రలేఖనం, - టైలరింగ్, అద్దకం, ఎంబ్రాయడరీ మొదలగునవి.బత్తాయినారింజనిమ్మ.పాలకొల్లు బత్తాయిలకు బహు ప్రసిద్దం. ప్రస్తుతం ఉత్పత్తి తగ్గినప్పటికిన్నీ పేరు మాత్రం మారలేదు. సినిమాలలో సైతం పాలకొల్లు బత్తాయి పేరు అత్యధికంగా వినిపిస్తుంది.

    నవారు లేదా నవ్వారు.మంచాలకు ఉపయోగించు నవ్వారు తయారు ఇక్కడ అధికం. నవ్వారు నేయు యంత్రములు షావుకారు పేట అను ప్రాంతమందు అధికం. ఈ ప్రాంతమునుండి ఇతర ప్రాంతములకు ఎగుమతి జరుగును.

    లేసు పరిశ్రమ.పాలకొల్లులో లేసు పరిశ్రమ ద్వారా ఇతర దేశాలకు సైతం ఎగుమతి జరుగును. పాలకొల్లు కేంద్రంగా కొమ్ముచిక్కాల లో దాదాపు రెండువేలమంది పనిచేయు లేసు పరిశ్రమ కలదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసిన 'పీతాని సత్యనారయణ' తండ్రి పేరున స్థాపించిన 'పేతాని వెంకన్న'లేసు పరిశ్రమ పాలకొల్లులో అతిపద్ద పరిశ్రమ.

    • ఆంధ్ర ప్రదేశ్ లో రక్షిత మంచి నీటి పథకము ద్వారా స్వాతంత్ర్యమునకు పూర్వము నుండి మంచి నీరు సరఫరా జరిగిన అతి కొద్ది మునిసిపాలిటీలలో పాలకొల్లు మొదటి మునిసిపాలిటి.
    • పాలకొల్లు మిఠాయి తయారీలకు కూడా ప్రసిద్ది చెందినది. ఇక్కడ పూతరేకులుసొనె పాప్పొది,బూందీ లడ్డుజీడిపప్పు పాకంహల్వా లు విపరీతంగానూ, అత్యదికంగానూ ఎగుమతి అయ్యే మిఠాయిలు.

    ఈ మండలంలో పనిచేసిన తహసీల్దార్లు

    ప్రముఖులు
    • `Here someny social work centres one of the st.mary's rehabilitation centre for orphans & lepers beside of eye hospatal.
    • స్వాతంత్ర్య పోరాటములో పాల్గొనిన ప్రముఖ వ్యక్తి అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి.
    • తెలుగు లో గజల్ సంగీత, కవితా ప్రక్రియలకు మంచి ప్రజాదరణ తెచ్చిన గజల్ శ్రీనివాస్ కూడా పాలకొల్లు వాడే.
    • మాండొలిన్ వాయిద్యంపై సంగీతాన్ని పలికించడంలో చిన్నతనం లోనే పేరుపొందిన యు.శ్రీనివాస్ జన్మ స్థానం పాలకొల్లు.
    వినోద మాధ్యమంపాలకొల్లు పట్టణంలో ప్రజల వినోదార్థం పది సినిమా థియేటరులు మరియు లలితకళాంజలి నాటక అకాడమీలు కలవు. సినీ రంగములో ప్రసిద్దులైన వారు సైతం వారి సొంత పట్టణములో చలన చిత్ర ప్రదర్శన శాలలు నిర్మించడం తో పట్టణం నలు మూలలా సినీ వినోదం సంమృద్ధిగా లభించుచున్నది. ప్రదర్శన శాలల జాభితా-

    • దాసరి సినీ చిత్ర {బస్టాండు సమీపంలో}
    • శ్రీనివాసా థియేటర్ {బస్టాండు వెనుక}
    • శ్రీనివాసా డిజిటల్ థియేటర్ {ఇది రాష్ట్రంలో మొట్టమొదటి మృదులాంత్ర ప్రదర్శనశాల. బస్టాండ్ వెనుక}
    • శ్రీ తేజ థియేటర్ (యడ్ల బజార్)శ్రీ తేజ మిని థియేటర్ (యడ్ల బజార్)
    • శ్రీనివాసా మినీప్యాలస్ { బస్టాండ్ వెనుక}
    • శ్రీ అన్నపూర్ణ థియేటర్ {రైల్వే స్టేషన్ రోడ్}
    • శివ పార్వతి {డీటీఎస్} {ఎర్ర వంతెన వద్ద}
    • శ్రీ వీర హనుమాన్ {మఠంవీధి}
    • శ్రీ మారుతీ థియేటర్ {రామ గుండం వీధి}
    • శ్రీ రంజనీ సినీ చిత్ర {బస్టాండ్}
    (గజలక్ష్మి, వెంకట రామా థియేటర్లు రెండు ప్రస్తుతం తీసివేయబడినవి) (లక్స్మి సాయి ఛిత్రాలయ పేరు శివ పార్వతి గా మార్ఛబడినది.)

    విద్యా సౌకర్యాలుకళాశాలలు.
    • అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల. {బస్టాండ్ వైపు}
    • దాసరి నారాయణరావు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల..{యడ్లబజారు వద్ద}
    • చాంబర్స్ మరియు కామర్స్ కళాశాల. {పూలపల్లె మార్గములో}
    • గౌతమీ జూనియర్ కళశాల. {పూలపల్లె మార్గములో}
    • రైస్ మిల్లర్స్ జూనియర్ కళాశాల. {వీరహనుమాన్ చిత్రప్రదర్శనశాల మార్గములో}
    ఉన్నతపాఠశాలలు.
    • మాచేపల్లి మాణిక్యం-కంచర్ల నరసింహం ఉన్నత పాఠశాల (1900)
    • బంగారు రామారావు-మాచేపల్లి వెంకటరత్నం ఉన్నతపాఠశాల {ముఖ్యరహదారి}
    • బి.వి.ఆర్.ఎమ్.బాలికల ఉన్నత పాఠశాల {అన్నపూర్ణ దియేటరు వద్ద }
    • అల్లు వెంకట సత్యనారాయణ ఉన్నతపాఠశాల (1996) కెనల్ రొడ్
    • బి.వి.ఆర్.ఎమ్.బాలుర ఉన్నత పాఠశాల (అడవిపాలెం,దొడ్డిపట్ల రహదారిన విజయచిత్ర దియేటర్ వద్ద)
    • రైస్ మిల్లర్స్ ఉన్నత పాఠశాల. {వీరహనుమాన్ చిత్రప్రదర్శనశాల}
    • Sunshine English Medium School {Bank Street}
    • St.Mary's School,yallavanigaruvu.
    బోర్డు పాఠశాలలు.రవాణా సౌకర్యాలుపాలకొల్లు నుండి ఎటు వైపునకైనా ప్రయాణము చేయుట అతి సులభము.పాలకొల్లు డిపో కానప్పటికీ ఈ పట్టణం రవాణా నర్సాపురం మరియు భీమవరం మరియు తణుకు మరియు రాజోలు డిపోల మద్య నుండుట వలన నుండి ప్రతి పది నిముషములకు ఒక బస్సు పాలకొల్లు బస్టాండు నుండి బయలు దేరుతుంటుంది.ఇవేకాక పాలకొల్లు నుండి ప్రరిసరప్రాంతముల ప్రతి చిన్న గ్రామాలకు కూడా సర్వీసులు కలవు.

    ఇతర సర్వీసులు.
    • ఆటోలు
    • టాక్షీలు. {మూడు టాక్షీ స్టాండులు కలవు}
    • ప్రైవేటు బస్సులు
    పాలకొల్లు మాద్యమముగా అత్యధికంగా నడిచే బస్సుల సర్వీసులు





A video of Kommuchikala village from Facebook user.